జంపింగులకు కేసీఆర్ మార్క్ షాక్.. ఆ ముగ్గురుకు నో.!

-

మరోసారి బి‌ఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కే‌సి‌ఆర్ ఇమేజ్ ఒక్కటే సరిపోదు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్, కే‌సి‌ఆర్ ఇమేజ్ బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఉపయోగపడింది. రెండుసార్లు అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఈ సారి మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా చేసిన పని బట్టే ప్రజలు తీర్పు ఇస్తారు. అలా అని కేవలం ప్రభుత్వ పనితీరునే గమనించరు. ఎమ్మెల్యేల పనితీరు కూడా గమనిస్తారు.

వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం చేశారనేది ముఖ్యం. ఒకవేళ తమ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోతే వారిని ప్రజలే పక్కన పెడతారు. మరొకసారి ఆ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో నిలబడితే ఓడిస్తారు. ఇప్పుడు ఆ దిశగానే ప్రజలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజానాడి ముందుగానే కనిపెట్టిన కే‌సి‌ఆర్..ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు.

 

ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన్ఆ ఎమ్మెల్యేలని సైతం పక్కన పెట్టడానికి కే‌సి‌ఆర్ వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ముగ్గురు జంపింగ్ ఎమ్మెల్యేలకు కే‌సి‌ఆర్ షాక్ ఇస్తారని తెలుస్తోంది. అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలకు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే బి‌ఆర్‌ఎస్ 1, కాంగ్రెస్ 6, టి‌డి‌పి 2, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అయితే 4 గురు కాంగ్రెస్, ఇద్దరు టి‌డి‌పి, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు.

ఇప్పుడు వారిలో ముగ్గురుకు ఇప్పుడు సీట్లు ఇవ్వడం లేదని తేలింది. మొదట కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరావుని పక్కన పెడుతున్నారు. నెక్స్ట్ ఇల్లందులో హరిప్రియకు సైతం ఈ సారి సీటు లేదని తేలింది. అటు వైరాలో రాములుని సైతం పక్కన పెట్టడం ఖాయమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version