బట్టలు విడదీసి.. తరిమి కొడతా – లోకేష్‌ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

-

బట్టలు విడదీసి.. తరిమి కొడతానంటూ నారా లోకేష్‌ పై పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకరనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ మీడియాతో మాట్లాడారు. తోడుదొంగల్ని ఇద్దరినీ పక్కలో పెట్టుకొని పెనుకొండలో రాజకీయం చేయాలని చూస్తున్నాడని నిప్పులు చెరిగారు.

పార్థసారథి ఓ మద్యం స్మగ్లర్, సవితమ్మ ఓ డీజిల్ స్మగ్లర్ అంటూ ఫైర్‌ అయ్యారు. నారా లోకేష్ కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే శంకరనారాయణ. నువ్వు మగాడివైతే నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా… అని సవాల్‌ చేశారు. జగన్ కను సైగా చేస్తే నీ బట్టలు విడదీసి జిల్లా నుంచి తరిమి కొడతానని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యే శంకరనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version