మా జగన్ ఎన్టీఆర్ లా అమాయకుడు కాదు.. చంద్రబాబు ఆటలు సాగవ్ – పేర్ని నాని

-

మా జగన్ ఎన్టీఆర్ లా అమాయకుడు కాదు నీ ఆటలు సాగవంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసిపి నేతలు… పార్టీ మారుతున్న నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి మరి దుమ్ము దులిపారు మాజీ మంత్రి పేర్ని నాని.


వైసీపీని వీడిన వారి బతుకు… ఆగమైపోతుందని కూడా తెలిపారు. వైసిపి తో కష్టాల్లో కూడా ఉన్నవాళ్లే అసలు సిసలైన కార్యకర్తలని కొనియాడారు. వైయస్ జగన్ గారి కష్టం, ప్రజల్లో మమేకమయ్యే నైజం వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన బలం అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ పడినా.. లేచినా జగన్ గారితోనే… అన్నారు. 2029లో కూడా వైయస్ జగన్ గారిని నమ్ముకునే కార్యకర్తలు పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించేస్తారని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news