అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో.. రేపు రిలీ కాబోతున్న పుష్ప 2 గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా టికెట్స్ పై పెంచిన ధరల వివాదం ఇప్పుడు హై కోర్టు కు చేరింది. తాజాగా పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు సవాలు చేస్తూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపింది హై కోర్టు.
ఇందులో.. ప్రీమియర్ షో లకు అనుమతి లేదని, టికెట్ ధరలు భారీగా ఉండటం నిబంధనలకు విరుద్ధం అని కోర్టుకు తెలిపారు పిటిషనర్. రోజుకి 5 షోలు మాత్రమే జీఓ ప్రకారం ఇవ్వాల్సి ఉండగా 6 షోలకు అనుమతి ఇచ్చారన్నారు పిటిషనర్. 100 కోట్ల నిర్మాణ వ్యయం అవకుండా అయ్యాయని నిర్మాతలు చెబుతున్నారని దీనిపై ఈడి విచారణ చేయాలనీ పిటిషనర్ కోరారు. అయితే వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హై కోర్టు.