Vizianagaram Train Derailment : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన సహాయక చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు. సహాయ చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రిని మోదీ ఆదేశించారు. ఆటు ప్రస్తుత సహాయక చర్యలపై సీఎం జగన్ తో రైల్వేమంత్రి ఫోన్ లో మాట్లాడారు.
కాగా, రైలు ప్రమాదంలో తీవ్రం గా గాయపడి విజయనగరం MIMSలో చికిత్స పొందుతున్న 29 మందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. బాధితుల్లో ఎక్కువ మంది చెస్ట్, న్యూరో సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరందరినీ విశాఖ కేజీహెచ్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు., సంఘటన స్థలంకు కేజీహెచ్ వైద్యులను ఉన్నతాధికారులు పంపించారు. గాయపడి బోగీల్లో చిక్కుకున్న వాళ్ళు ఉంటే తరలించేందుకు ప్రయత్ని స్తున్నారు.