అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యూఎస్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట పార్క్ చేసిన టెస్లా సైబర్‌ట్రక్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై లాస్‌వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది.
ట్రంప్‌నకు చెందిన హోటల్ బయట టెస్లా సైబర్‌ట్రక్‌లో జరిగిన పేలుడు ఘటనపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించాడు. దీనిపై సీనియర్ బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. మాకు ఏదైనా తెలిసిన వెంటనే, మేము మరింత సమాచారాన్ని అందజేస్తామన్నారు.
ట్రంప్ టవర్ ముందు బ్లాస్ట్..
అగ్రరాజ్యం అమెరికా లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్ టవర్ వెలుపల పేలుడు సంభవించింది. ఈ ఘటనలో టెస్లా సైబర్‌ట్రక్ మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.https://t.co/iPdcphBI9M pic.twitter.com/S1lJgVSN9W
— ChotaNews App (@ChotaNewsApp) January 2, 2025