గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. తాజాగా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఫోన్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు… ఆయన ఫోన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు వచ్చినట్లు తెలుస్తోంది.
రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు.. వంశీ ఇంట్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాదులోని వల్లభనేని వంశీ ఇంటికి చేరుకున్న పోలీసులు….వల్లభనేని వంశీ ఇంటి వద్ద సిసిటివి ఫుటేజ్ ను సేకరిస్తు న్నారు. గత వారం రోజులు ఇంటికి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు…. ఫోన్ కోసం వల్లభ నేని వంశీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.