ఆ జిల్లాలో పోలీస్ స్టేషన్ల మార్పులు చేర్పులు

-

సాధారణంగా ఒక మండలంలోని గ్రామాలన్నీ ఆ మండల పోలీస్ స్టేషన్(పీఎస్) పరిధిలోనే ఉండేలా హోం శాఖ మార్గదర్శకాల్లో ఉన్న ఆచరణ లో మాత్రం ఇప్పటి వరకు లేదు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన గ్రామాలు వేరే మండల పరిధిలోని పీఎస్ ల కింద ఏళ్ల నుంచి ఉన్నాయి . కానీ ఇటీవల జిల్లాల విభిజన నేపథ్యంలో విలీన ప్రక్రియ లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ చర్యలు చేపట్టారు.ఇప్పటి వరకు అలవాటు పడిన పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతి మీద ప్రజలకు అవగాహన కలిగించే దిశగా అడుగులు వేస్తున్నారు.

జిల్లాలో ఏ పోలీసు స్టేషన్ , ఏ సర్కిల్, ఏ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుందో కూడా పోలీసులు ప్రజలకు వివరించాలని ఆదేశాలు జారీచేశారు. ఏప్రిల్ నాటికి ప్రజలు మారిన పోలీసు స్టేషన్ లలో తమ సమస్యల పై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

పోలీసు స్టేషన్ ల వివరాలు :

1. కందుకూరు సబ్ డివిజన్ లోని గుడ్లూరు పీఎస్ కింద ఉన్న చినపవని, పెదపవని, ముత్యాలపాడు, ముత్తువారి పల్లి, అంగిరేకులపాడు, మేదరమెట్ల వారి పాలెం, అన్నేబోయిన పల్లి గ్రామాలు లింగసముద్రం పీఎస్ పరిధిలోకి వస్తాయి.
2. కందుకూరు పట్టణ పీఎస్ కింద ఉన్న మోపాడు, కంచరగుంట గ్రామాలు కందుకూరు గ్రామీణ పీఎస్ కిందకి రాబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు పట్టణ పీఎస్ పరిధిలోని వలేటివారి పాలెం మండలానికి చెందిన కాకుటూరు, బడేవారిపాలెం, అత్తింటి వారి పాలెం, మాచవరం, పోకూరు, సింగమనేనిపల్లి , కొండారెడ్డి పల్లి, నలదలపూర్ గ్రామాలు ఇక నుంచి వలేటివారి పాలెం పీఎస్ కిందకి వెళ్లబోతున్నాయి.
3. వేటపాలెం పీఎస్ పరిధిలోని మట్టిగుంట , ఇంకొల్లు పీఎస్ పరిధిలోని నాగులుప్పలపాడు మండలానికి చెందిన తిమ్మసముద్రం , మద్దిరాల, ముప్పాళ్ల గ్రామాలు ఇకపై నాగులుప్పలపాడు పీఎస్ పరిధిలోకి వెళ్తాయి.
4. గిద్దలూరు పీఎస్ పరిధిలో ఉన్న రాచర్ల మరియు కోమరోలు రెవెన్యూ మండలాలకు చెందిన గ్రామాలు రాచర్ల , కోమరోలు పీఎస్ ల పరిధిలోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news