జోగి రమేష్ సిమ్ కార్డు అడుగుతున్న పోలీసులు..!

-

అగ్రిగోల్డ్‌ భూముల కేసు విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తూనే ఉంది. ఈ కేసులో ఒక దాని నుండి బయటకు వచ్చే లోపు మరో దాంట్లో ఆయన ఇరుకపోతున్నారు. అయితే తాజాగా తన సిమ్ కార్డు ఇవ్వాలని పోలీసులు జోగి రమేష్ కు సూచించారు. అయితే ఈ విషయంలో మంగళగిరి డిఎస్పీ ఎదుట జోగి రమేష్ తరుపు న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జోగి రమేష్ సెల్ ఫోన్ సిమ్ కార్డును పోలీసులు అప్పగించమన్నారు. కానీ సెక్షన్ 20 (3)యాక్ట్ కింద నిందితుడి సెల్ ఫోన్ అడిగే హక్కు పోలీసులకు లేదు.

గతంలోనే పోలీసులకు ఇవ్వాల్సిన సమాచారం అంతా జోగి రమేష్ ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ మాజీ మంత్రి కి చెందిన, సెల్ ఫోన్ ను పోలీసులు అడగడం పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అంశమే. అందుకే సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదని పోలీసులకు చెప్పాము అని జోగి రమేష్ తరపున న్యాయవాదులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news