ఎన్నికల సంఘానికి వైసీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఈసీ అధికారులని కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశామని… అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు పేర్ని నాని. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని గతంలో చెప్పారు.స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారు.
కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు….ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారని అడిగామని వివరించారు మాజీ మంత్రి పేర్ని నాని.