టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఆదివారం బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. బీసీల సమగ్ర సర్వే కోసం ఐదుగురు ఐ.ఏ.ఎస్ లతో కూడిన కమిటీ వేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. బీసీలకు పెదరికమే సుదీర్హ రోగమన్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ. పేదరికంతో రెండు మూడు తరాలు ఇబ్బందులు పడ్డాయని తెలిపారు.
కుల వృత్తుల ద్వారా వచ్చే ఆదాయం పొట్ట నింపుకోవడానికే సరిపోయిందన్నారు. పెదరికానికి వైద్యం చేసిన మహా నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. బీసీలను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు. బీసీల అవసరాలు గుర్తించి పథకాలు అందించే దిశగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం బీసీలకు చేసిన మేలుపై విస్త్రతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.