ఏపీలో విపరీతంగా కరెంటు కోతలు !

-

ఏపీలో విపరీతంగా కరెంటు కోతలు ఉన్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి, చేతకాని తనంవల్ల కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయని ఫైర్‌ అయ్యారు.

ఎన్నికలకు ముందు రైతులకు 9 గంటలు నిరాటంకంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతలతో కొట్టు మిట్టాడుతుంటే, సీఎం విద్యుత్ శాఖతో ఏనాడైనా సమీక్షించారా? అని నిలదీశారు.

పీపీఎలు రద్దు చేయొద్దు, కొనసాగించండని చంద్రబాబు కోరినా కమీషన్ల కోసం రద్దు చేసిందని… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెట్టి.. నోటీసులు జారీ చేసినా బుద్ధి రాలేదని ఆగ్రహించారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్చీలు పెంచనని నంగనాచి కబుర్లు చెప్పి 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారని.. చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. కరెంటు కోతలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల్లో ఏపీని మొదటి స్థానంలో పెట్టిన ఘనత మీదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news