ట్యాక్స్ రిఫండ్ లేట్ అయితే.. ఏం చెయ్యాలి..?

-

ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడానికి జులై 31తో గుడవు ముగిసిన విషయం తెలిసిందే. ఇ-ఫైలింగ్ పోర్టల్‌ ప్రకారం ఆగస్టు 30 నాటికి 5.77 కోట్ల రిటర్నులు ప్రాసెస్ అయ్యాయి. అయితే వేళల్లో కొందరికి రిఫండ్ అందింది. కొంతమంది రిటర్నులు ప్రాసెస్ అయినట్లు చూపించినా రిఫండు మాత్రం రాలేదుట. ఒకవేళ రిఫండ్ లేట్ అయితే ఏం చేయాలి ఎలా పొందాలి అనేది చూద్దాం. రిటర్నులు దాఖలు చేసేటప్పుడు సమాచారంలో ఏ విధమైన తప్పులూ లేకుండా చూసుకోవాలి.

అలానే బ్యాంక్ అకౌంట్ వివరాలని కూడా సరిగ్గా ఇవ్వాలి. ఆదాయపు పన్ను విభాగం నుంచి అదనపు వివరాలు అడిగి నోటీసులు వచ్చినప్పుడు పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి వాటిని మీరు తెలుసుకోవాలి. పూర్తి సమాచారాన్ని తప్పులు లేకుండా ఇవ్వాలి. క్లెయిం చేసిన మొత్తం, ఫారం 26ఏఎస్‌లో పేర్కొన్న మొత్తం
సరిపోలేదంటే రిఫండ్ ప్రాసెస్ మొదలు పెట్టరు.

పన్ను రిఫండు పరిస్థితిని తెలుసుకోవాలంటే పన్ను పోర్టల్‌లోకి వెళ్లి… మీ రిటర్నులు ఇ-వెరిఫై చేసుకున్నారో లేదో చూసుకోండి. ఒక వేళ చేయకపోతే దాన్ని మీరు పూర్తి చేయండి. అలానే ట్యాక్స్ విభాగం నుంచి ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ ఏమైనా వచ్చాయో చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news