విశాఖ ఎయిర్పోర్టులో ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ పోలీసులు ఆధ్వర్యంలో ప్రీపెయిడ్ టాక్సీ సర్వీస్ ని ప్రారంభించారు విశాఖ పోలీస్ కమిషనర్ శంక బ్రతా బాగ్చి, డిసిపి మేరీ ప్రశాంతి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి. ఈ క్రమంలో సీపీ శంఖ భ్రత బాగ్చి మాట్లాడుతూ.. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు వెళ్లడానికి ఈ ప్రీపెయిడ్ టాక్సీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి సమయంలో ఎయిర్పోర్టుకి చేరుకున్న మహిళలకు ఈ ప్రీపెయిడ్ టాక్సీ సర్వీస్ ఎంతో రక్షణగా ఉంటుంది. ప్రతి ప్రీపెయిడ్ టాక్సీ లకు GPS సిస్టం అమరచడం జరిగింది.
ఏ కారణం చేతనైనా అనుకున్న సమయానికి వెహికల్ గమ్యస్థానానికి చేరకపోతే తక్షణమే ఆ టాక్సీ ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. బయట నుంచి వచ్చే విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి ప్రీపెయిడ్ టాక్సీ సర్వీస్ కేంద్రం వద్ద ధరలు పట్టిక ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు మోసపోకుండా ఉంటారు. ప్రీపెయిడ్ టాక్సీ నడిపే డ్రైవర్లందరూ పూర్తి శిక్షణ కలిగి ఉండడంతో పాటు వారి పర్సనల్ డేటా కూడా మా పోలీస్ దగ్గర ఉండడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి అని అన్నారు.