హరీష్ రావు కు ఛాలెంజ్ విసిరిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ..!

-

BRS నేత MLA హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేసారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు జీవో 520 విడుదల చేశారు. కానీ, ఒక్క హాస్పిటల్‌లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదు. 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేశారు. కానీ.. ఎంబ్రయాలజిస్ట్‌ను, స్టాఫ్‌ను నియమించలేదు. అవసరమైన అనుమతులు తీసుకోలేదు అని పేర్కొన్నారు.

ఐవీఎఫ్ చేయడానికి అవసరమైన కెమికల్స్, మెడిసిన్ కొనడానికి నిధులు మంజూరు చేయలేదు. ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చాక అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాం. ట్రైన్‌డ్ స్టాఫ్‌ను అలాట్ చేశాం. నిధులు కేటాయించాం. అవసరమైన అనుమతులు తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభించాం. మేము చిత్తశుద్ధితో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే, దాన్ని మీఖాతాలో‌ వేసుకునేందుకు చవకబారు‌ విమర్శలు‌ చేస్తున్నారు. సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే మీ హయాంలో గాంధీలో ఒక్కరికి ఐవీఎఫ్ చేసినట్టు నిరూపించండి. పేట్లబుర్జు, ఎంజీఎంలో ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడున్నాయో చూపించండి. లేదా, ఇకనైనా ఇలాంటి చవకబారు‌ ఆరోపణలు మానుకోండి‌. ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాకుండా, మాతృత్వం కోసం తపిస్తున్న మహిళలను మోసం చేసినందుకు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పండి అని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news