ఏపీలోని గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ సరఫరాకు రంగం సిద్ధం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంటు సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది జగన్ సర్కార్. ఓల్టేజ్ , ఓవర్ లోడ్, ట్రిప్ , కరెంటు కోతలు లాంటి సమస్యలకు చెక్ పెట్టినందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే మూడు రోజుల కిందట 3100 కోట్ల వ్యయంతో 12 సబ్ స్టేషన్లను ప్రారంభించడంతో పాటు మరో పదహారు సబ్ స్టేషన్ల కు శంకుస్థాపన చేశారు.

ఈ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు చెక్ పడినట్లే అవుతుంది. ఇవే కాకుండా కడపలో 750 మరియు అనంతపురంలో 100 మెగా వాట్ల సామర్థ్యం తో కూడిన సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా అడుగులు పడటంతో గృహ మరియు వ్యవసాయం అలాగే పారిశ్రామిక రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే పగటిపూట వ్యవసాయానికి… 9 గంటలపాటు పకడ్బందీగా విద్యుత్ సరఫరా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. త్వరలోనే ఈ లక్ష్యాన్ని కూడా చేరుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news