హైదరాబాద్ లో సినీ నిర్మాత కిడ్నాప్.. అచ్చం సినిమాల్లోలాగే !

-

హైదరాబాద్ లో కడపకి చెందిన ఒక గ్యాంగ్ రచ్చ చేసింది. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే కార్ ఆగడం, మనిషిని లాక్కుని కార్ లోకి ఎక్కించడం, వెంటనే అక్కడి నుండి మాయం కావడం అంతా ఏదో ఒక షూటింగ్ లా జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ లో సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగర నడిబొడ్డున టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండా రెడ్డి హల్చల్ చేసారు. సినిమా ప్రొడ్యూసర్, డిస్ట్రీబ్యూటర్ శివ గణేష్ ను కొండారెడ్డి గ్యాంగ్ సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి క్షణంలో మాయం అయింది.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నేత వరద రాజులు రెడ్డి కొడుకు కొండా రెడ్డి అతని అనుచరుల పనే ఇదని అంటున్నారు. తుపాకులు, కత్తులు చూపించి బెదిరింపులకు పాల్పడ్డట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. శామీర్ పేట, అలానే కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాల పై ఈ గ్యాంగ్ బెదిరించి సంతకాలు చేయించుకున్నట్టు బాదితుడు చెబుతున్నాడు. వారు అతన్ని వదిలేశాక బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రొడ్యూసర్ శివ గణేష్, దీంతో కొండా రెడ్డి తో పాటు రౌడీ గ్యాంగ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బంజారా హిల్స్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version