రేపు మధ్యాహ్నం 11.50 గంటలకు PSLV.. C 57 రాకెట్ ప్రయోగం

-

రేపు మధ్యాహ్నం 11.50 గంటలకు PSLV.. C 57 రాకెట్ ప్రయోగం ఉంటుందని పేర్కొన్నారు ఇస్రో ఛైర్మన్ డా.సోమ్ నాథ్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాలమ్మ దేవాలయం లో ఇస్రో ఛైర్మన్ డా.సోమ్ నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డా.సోమ్ నాథ్ మాట్లాడుతూ… రేపు ఆదిత్య L1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఎప్పటి లాగే అమ్మవారి ఆశీస్సులు కోసం వచ్చామని.. రేపు మధ్యాహ్నం 11.50 గంటలకు PSLV.. C 57 రాకెట్ ప్రయోగం ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుని వద్దకు పంపనున్న ఆదిత్య L1 ఉపగ్రహం పంపుతామని.. PSLV. C57 రాకెట్ ప్రయోగానికి 24 గంటల కౌంట్ డౌన్ ఉంటుందన్నారు ఇస్రో ఛైర్మన్ డా.సోమ్ నాథ్.

చంద్రయాన్..3 కి సంబంధించిన లాండర్, రోవర్ లు చంద్రునిపై విజయవంతం గా పని చేస్తున్నాయని.. చంద్రయాన్ విజయం లో శాస్త్రవేతలందరి కృషి ఉందని వెల్లడించారు. అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో మానవ రహిత గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని ప్రకటించారు. అనంతరం GSLV.. mk.2 ద్వారా INSAT.3Ds రాకెట్ ప్రయోగం చేపడుతామని.. తదుపరి మాసంలో SSLV రాకెట్ ప్రయోగం చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news