పులిచింతలకు పోటెత్తిన వరద.. 11 గేట్లు ఎత్తి నీటి విడుదల

-

ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరికి పోటెత్తుతోంది. ఇక కృష్ణమ్మ పరవళ్లతో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 11 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతలకు ఎగువ నుంచి 2.45 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోందని అధికారులు తెలిపారు.

ఇక విద్యుదుత్పత్తి కోసం 15 వేల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నట్లు చెప్పారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజికి పంపిస్తున్నామని వెల్లడించారు. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 31.89 టీఎంసీలుగా ఉంది. వరద పోటెత్తుతుండటంతో నీటిమట్టాల్ని అలాగే కొనసాగిస్తూ వచ్చిన వరద నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news