పుంగనూరు ఘటనపై పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్షం గొంతు వినిపించకూడదనే నియంతృత్వం పెచ్చరిల్లుతోందని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజల తరఫున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు.వైసీపీ నియంతృత్వం పెచ్చరిల్లుతోంది…పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు.
పుంగనూరులో ప్రతిపక్ష నేత పర్యటనలో జరిగిన సంఘటన శోచనీయం అని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యానికి ఈ సంఘటనే ఉదాహరణ అని.. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పని చేయాలని ఆగ్రహించారు పురందేశ్వరి.