టీడీపీలో వచ్చిన సంక్షోభం..వైసీపీలో రాబోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మంచివారైనప్పటికీ, 1995లో టీడీపీలో ఆ పార్టీ ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి గారి ప్రమేయం ఎక్కువై, ఎమ్మెల్యేలను అవమానించి, అవహేళన చేసినట్టు ప్రవర్తించడం వల్ల సంక్షోభం తలెత్తిందని, పార్టీ పరిరక్షణ కోసం, ఆ పార్టీ శాసనసభ్యులు, నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారని గుర్తు చేశారు.
ఆ విషయాన్ని ఇటీవల ఆహా ఓటిటి ఛానెల్ లో నందమూరి బాలకృష్ణ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడు ఘాటు చెప్పారని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు. తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తమ పార్టీలోనూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక వర్గం ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మీపార్వతిగా సంబోధిస్తుంటే, మరొక వర్గం ఎమ్మెల్యేలు మగ లక్ష్మీపార్వతి అని అంటున్నారన్నారు.