చంద్రబాబు బరువు 72 కేజీలు…కానీ 67కు చేరింది – వైసీపీ ఎంపీ

-

ఎన్టీఆర్ గారి స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి తాను కూడా పాల్గొన్నానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. అప్పుడే పెద్దాయనను మీ బరువు ఎంత సార్ అని అడిగానని, దానికి ఆయన 72 కేజీలని సమాధానం చెప్పారని, మీ హైట్ కు మీరు మరో 10 కేజీల బరువు పెరగవచ్చు కదా అని సూచించగా… బరువు తగ్గకుండా, పెరగకుండా ఇదే బరువును కొనసాగిస్తానని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారని తెలిపారు.

జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 66 కేజీల నుంచి కేజీ పెరిగి 67కు చేరుకున్నారని జైలు అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు చెప్పినట్లుగా 34 రోజుల వ్యవధిలో జ్యూడిషియల్ రిమాండ్ లో ఆయన ఐదు కేజీల బరువు తగ్గారన్నది వాస్తవమని, ఇది ఎంతో ప్రమాదకరమని, వేగంగా ఇంత బరువు తగ్గడం వలన అది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు డయా బెటిక్ పేషంట్ అని ఆయనకు వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా జైలు అధికారులు పేర్కొనడం పరిశీలిస్తే పెద్దాయన ఆరోగ్యం పట్ల వారు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి శరీరంపై దద్దుర్లు ఉంటే క్రీమ్ అందజేశామని చెబుతున్నారని, అంతకంటే ఆయన వ్యక్తిగత వైద్యున్ని పిలిచి మాట్లాడించి ఉంటే బాగుండేది కదా?! అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news