బతుకమ్మ పూల పండుగ ప్రారంభమైంది. భక్తి ప్రపత్తులతో నృత్యగీతాలతో బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్నా పెద్దా అందరూ పల్లె నుంచి పట్టణం వరకే కాదు ప్రపంచంలో సుమారు 70కిపైగా దేశాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు. ఆదివారం రెండోరోజు బతుకమ్మ ‘అటుకుల బతుకమ్మ’గా పిలుస్తారు. నేటి ప్రత్యేకతలు పరిశీలిస్తే… ఆశ్వయుజ లేదా ఆశ్వీజ మాసం ప్రారంభం. పాడ్యమి తిథి. శరన్నవరాత్రుల ప్రారంభం.
బతుకమ్మ పండుగలో భాగంగా రెండో రోజైన సెప్టెంబర్ 29 ఆదివారం అటుకుల బతుకమ్మ’ను పూజిస్తారు. దీనికోసం ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు.
వాయనం: అటుకులను ఈ రోజు వాయనంగా ఇస్తారు.
నైవేద్యం: సప్పిడి పప్పు (బ్లాండలో ఉడికించిన కాయధాన్యాలు), బెల్లం, అటుకులు.