రామోజీరావుతో నాకు చుట్టరికం లేదు…కానీ కాపాడడం నా బాధ్యత – వైసీపీ ఎంపీ

-

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతను తను వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు కలవనప్పటికీ ఆయనను తన చిన్నతనం నుంచే ఎంతో అభిమానించే వాడినని, నా దేశం అన్ని విషయాలు తెలుసుకునే ఆయనకు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు అందించిన కారణంగా ఆ అవార్డు విలువను కాపాడడం కోసం, తనకు తెలిసిన నిజాలను మాట్లాడుతున్నానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కు వ్యతిరేకంగా ఈ డీ, సెంట్రల్ బోర్డు డైరెక్టర్ టాక్స్ ( సిబిడిటి )కి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చిన సంజయ్, సాక్షి మినహాయించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన విలేకరులతో కాకుండా, జాతీయ ప్రెస్ తో మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని, అయినా తెలుగు ప్రెస్ మీడియా సమావేశానికి హాజరై కొన్ని ప్రశ్నలు స్పందిస్తే వంకర సమాధానాలు చెప్పారని, చిట్ పండ్ చట్టాన్ని తాను
క్షుణ్ణంగా చదివి, మార్గదర్శి చందాదారులతో మాట్లాడి అధ్యయనం చేశానని, మార్గదర్శి కేసును చిట్ పండ్ చట్టం ఓనమాలు తెలియని ఇద్దరు బాలురు విచారిస్తున్నట్లుగా కనిపిస్తుందని అన్నారు.
మార్గదర్శి సంస్థ తన ప్రతి బ్రాంచ్ లోను మేనేజర్ ఆధ్వర్యంలోనే చిట్ లను నిర్వహిస్తోందని, మార్గదర్శి సంస్థ చిట్ పండ్ చట్టాన్ని అనుసరించాలని ఏపీసీఐడీ చీఫ్ సంజయ్ గారు పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. 1982 చిట్ పండ్ యాక్ట్ ను మార్గదర్శి సంస్థ కచ్చితంగా అనుసరిస్తోందని, ఇక నిధులను దారి మళ్లించారని చెత్త వాగుడు వాగుతున్నారని, అందులో ఎంత మాత్రం నిజం లేదని అన్నారు. ఎక్కడి బ్రాంచ్ నిధులను, చెక్ లను అక్కడి కంపెనీ అకౌంట్లో జమ చేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మార్గదర్శి సంస్థపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని అన్నారు. మార్గదర్శి సంస్థ, చిట్టిల నిర్వాహణ ద్వారా తనకు లభించే 5% కమిషన్ ను తీసుకోవడం మినహా ఖాతాదారుల డబ్బులు దారి మళ్లించిన సంఘటనలు లేవని తెలిపారు. బ్యాలెన్స్ షీట్ ద్వారా వచ్చిన లాభం ఆ కంపెనీ ఏమైనా చేసుకోవచ్చునని, మార్గదర్శి సంస్థ అదే చేస్తోందని, మార్గదర్శి సంస్థ నుంచి చిట్ పాడుకొని, షూరిటీస్ ఇవ్వలేక ప్రీ పేమెంట్ చేసే వారికి కూడా ఆ సొమ్ముపై వడ్డీ చెల్లించవలసిన అవసరం లేకపోయినప్పటికీ, వారికి 4% వడ్డీని చెల్లిస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version