ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందని, నిరాశ నిస్సృహలో ఉన్న సమయంలో మనసులోని మాట బయటకు వస్తుందని, మూడు నెలల క్రితం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఓడిపోతే, పోతాం… ఓడ గొడితే ఏమి చేస్తాం… ఇంట్లో హ్యాపీగా కూర్చుంటాం అని అన్నారని, కేసీఆర్ గారు తెలుగులో చెప్పిందే… ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే కాంక్లేవ్ లో ఇంగ్లీషులో నిర్వేదంగా చెప్పారని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు.
నిన్న మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని ఊదరగొట్టారని, దొంగ ఓట్లను నమ్ముకున్నారని, దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి సారించి 50 లక్షల నుంచి పదిలక్షలకు తగ్గించిందని, ఇంకా దొంగ ఓట్లను ఏరి వేసే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉందని అన్నారు. ఈ ప్రభుత్వంపై ఉద్యోగస్తులు, నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారని, అబద్ధపు హామీలు ఇచ్చి మోసగించిన జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంపై మహిళలు కూడా తిరుగుబాటు బావుటాను ఎగరవేశారని తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఆసరా మోసంపై అన్ని వర్గాలు ఆగ్రహంతో గుర్రుగా ఉన్నాయని అన్నారు. తెలిపారు.