చంద్రబాబు విడుదలతో నిజమైన విజయదశమి జరుపుకుందాం – రఘురామ

-

విజయదశమి పండగ సెలవులకు ముందే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి న్యాయస్థానంలో ఉపశమనం లభించడం ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదల కావడంతో నిజమైన విజయదశమి వేడుకలను జరుపుకుందామని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టు క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం నాడు ఇరు పక్షాల వాదనలు విని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసినప్పటికీ, సోమవారం నాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.

న్యాయస్థానంలో న్యాయమూర్తులు న్యాయ నిర్ణీతలైతే, ప్రజా న్యాయస్థానంలో ప్రజలే న్యాయ నిర్నేతలని అన్నారు. అవినీతి నిరోధక చట్టం 1988 లోని సెక్షన్ 13(1)A, B, C, D లలో C, D నిబంధనలను 2018 జులైలో చట్టం నుంచి తొలగించారని, ఇదే విషయాన్ని జస్టిస్ బేలాత్రివేది గారు ప్రాసిక్యూషన్ తరపున వాదనలను వినిపిస్తున్న ముకుల్ రోహత్గి గారికి గుర్తు చేస్తూ… 13(1) C, D ల కింద కేసును ఎలా నమోదు చేశారని ప్రశ్నించారని అన్నారు. ఆ కేసు జరిగినప్పుడు చట్టం నుంచి సెక్షన్లను తొలగించినప్పటికీ కేసుకు వర్తిస్తాయని మెట్ట వేదాంతాన్ని ముకుల్ రోహత్గి గారు చెప్పుకొచ్చారని, ఇక్కడ పాయింటు ఏమిటంటే… 2018కి ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటే, అప్పటికి చట్టం నుంచి ఆ సెక్షన్లను తొలగించలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news