ఏపీ పోలీసులు… సంఘ విద్రోహక శక్తులు – ఎంపీ రఘురామ

-

ఏపీ పోలీసులు… సంఘ విద్రోహక శక్తుల్లాగా మారారని ఫైర్ అయ్యారు వైసీపీ రెబల్‌ రఘురామకృష్ణ రాజు. పోలీసుల్లో కొంత మంది ఎంత పనికిమాలిన వెధవలో తనకు తెలిసినంతగా మరెవరికి తెలియదని, పోలీసుల గురించి మాట్లాడితే… ఆ సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారట అని పేర్కొన్నారు. తనను గతంలో ఏ కారణం చేత అరెస్టు చేశారని, కెమెరాలను తొలగించి లాకప్ లో చిత్రహింసలకు ఎందుకు గురి చేశారని, తన సెక్యూరిటీని తొలగించి దారుణంగా హింసించిన ఘటనపై పోలీసు సంఘం ప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రఘురామకృష్ణ రాజు.

పోలీసుల దాష్టికాలు తనకంటే ఎక్కువగా మరెవరికి తెలియవని, రాష్ట్ర పోలీసులలో కొంత మంది సంఘ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అటువంటి వారి సంఖ్య రోజుకింత పెరుగుతోందని, అది వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ లేకపోతే మాజీమంత్రి వివేకానంద రెడ్డి గాడిని హతమార్చినట్లుగానే తనను కూడా గొడ్డలితో చంపే వారేమోనని చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతున్నాయని అన్నారు. హింసకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కాదని, ప్రతిపక్ష పార్టీ నాయకుడని, హింసను ప్రేరేపించేది ఎవరు?, వ్యతిరేకించేది ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version