చంద్రబాబు వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా? – వైసీపీ నేత సంచలనం

-

చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి నిరంతర ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, రాజమండ్రి జైల్లో దోమలు కుట్టి డెంగ్యూ వ్యాధితో ఒక ఖైదీ మృతి చెందారని, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా దోమలు కుడుతున్నాయని నారా లోకేష్ గారు ఎంత బాధతో ఈ విషయాన్ని చెప్పి ఉంటారని, జైలులో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో అందరికీ తెలిసిందేనని అన్నారు.

చంద్రబాబు నాయుడు గారిని అవసరమైతే ఆసుపత్రిలో పెట్టి ఆయన ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఉత్తరప్రదేశ్లో అపర్ణ అనే ఐఏఎస్ ను అరెస్టు చేయడానికి సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న సమయంలో ఒక గ్యాంగ్ వెళ్లి, లక్నో పోలీస్ కమిషనర్ గారిని కలిస్తే ఇదే విషయాన్ని లక్నో కమిషనర్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లగా, మరో గంట పాటు ఏపీసీఐడి పోలీసులు లక్నోలో ఉంటే అరెస్టు చేయాలని ఆదేశించడంతో పరుగో… పరుగు అంటూ తిరిగి మన రాష్ట్రానికి సీఐడి పోలీసులు పారిపోయి వచ్చారని అన్నారు.

ధర్మం నాలుగు పాదాలతో వర్ధిల్లుతుందంటే అది ఉత్తర ప్రదేశ్ లోనేనని, దొంగ కేసులు పెట్టడం, దొంగతనంగా ఎత్తుకెళ్లడమే ఏపీసీఐడీ పోలీసులకు తెలిసిన పని అని, తనపై నమోదు చేసిన కేసులోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సహకరించడంతో ఎత్తుకొచ్చారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు గారి విషయంలో సహకరించకపోవడంతో చేసేది లేక చేతులు ముడుచుకు కూర్చున్నారని అన్నారు. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు సమయమనం పాటించి, తీర్పు రేపటికి వాయిదా వేస్తే మంచిదని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news