విజనరీ లీడర్ నేడు ప్రిజనరీగా జైలులో కూర్చున్నాడు – కన్నబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కన్నబాబు. వెజినరీ లీడర్ నేడు ప్రిజనరీగా జైల్లో కూర్చున్నాడని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం చిత్రంగా జరిగిందని అన్నారు కన్నబాబు. రూ.3300 కోట్ల ప్రాజెక్టుకు కరెంటు తీసేసి ఆమోదం తెలిపారని.. చీకటి ఒప్పందం అంటే ఇదేనని ఎద్దేవా చేశారు.

కరెంటు పోయినప్పుడు సంతకాలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు కన్నబాబు. కేబినెట్ ఆమోదం చేసింది ఒకటి.. ఒప్పందం మరొకటన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ స్కామ్ ని వెలికితీశాయని చెప్పుకొచ్చారు. యువతకు శిక్షణ పేరుతో చంద్రబాబు అందిన కాడికి దోచుకున్నాడని మండిపడ్డారు. పక్క ప్లాన్ ప్రకారమే బాబు ఆదేశాలతో ఇదంతా జరిగిందన్నారు.

ఎంఓయు అంతా ఫేక్ అన్న కన్నబాబు.. దానికి సంబంధించిన పేపర్లపై తేదీలు కూడా లేవన్నారు. స్కాం లో డిజైన్ టెక్ అనే కంపెనీకి ముందుగా మనీ ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ఆ తరువాత షెల్ కంపెనీలకు ఆ నగదు ట్రాన్స్ఫర్ అయిపోయిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓ షెల్ కంపెనీకి 241 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news