జనన మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు, ఆస్తి హక్కు పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోను ముద్రించడానికి ఎన్నికల సంఘం ఎలా అంగీకరిస్తుందని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రి పనిచేశారని, ఇలా ఎవరూ కూడా సర్టిఫికెట్లపై తమ ఫోటోలను ముద్రించుకోలేదని, ముఖ్యమంత్రి పదవి అనేది శాశ్వతమైనది కాదని, ఇలా ఫోటోలను ముద్రించుకోవడం నార్సి సిజం అనే మానసిక వ్యాధి అని అని ఆగ్రహించారు.
ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి గారి ఫోటోలను ముద్రించడానికి ఏ నిబంధనలు అంగీకరించవని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, ముఖ్యమంత్రి గారి ఫోటోలను ముద్రించడం మెజారిటీ ప్రజలకు ఇష్టం ఉండకపోవచ్చునని, ముఖ్యమంత్రి గారి ఫోటోలను చూసి అసహ్యించుకుంటున్నారని, ఈ ప్రభుత్వం మారడం ఖాయమని, కాబోయే ముఖ్యమంత్రి గారిని టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఈ సర్టిఫికెట్లను రద్దు చేసి నూతన సర్టిఫికెట్లను మంజూరు చేయాలని కొరతానని అన్నారు. నూతన సర్టిఫికెట్లు మంజూరు చేయగానే, ఈ సర్టిఫికెట్లను సామూహికంగా దహనం చేద్దామని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.