చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ OMG2 సినిమాతో హిట్ అందుకున్నాడు. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓవైపు పోటీగా గదర్-2 ఉన్నా.. ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించింది. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. OMG సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్, పంకజ్‌ల నటన మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో అక్షయ్ దేవుడిగా నటించగా.. పంకజ్ భక్తుడిగా నటించారు.
థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 8వ తేదీన ఓటీటీలో ఈ చిత్రం ప్రసారం అవుతుందంటూ నెట్ఫ్లిక్ ప్రకటన చేసింది. కానీ అనుకున్నదాని కంటే ముందే.. చెప్పిన సమయం కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ్టి నుంచి ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయండని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో 27కట్స్‌తో రిలీజైంది. కానీ ఓటీటీలో ఎలాంటి కట్స్ లేకుండా ఒరిజినల్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేశారు.