ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అడ్డగోలు విద్యుత్ వాతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. తనకు తెలిసిన ఒక వ్యక్తి ఇటీవల అద్దె ఇంట్లోకి మారారని, ఆయనకు 4000 రూపాయల బిల్లు వచ్చిందని, గతంలో ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి చెల్లించని 850 రూపాయలను ఆ బిల్లులో జత చేశారని తెలిపారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరూ 500 నుంచి మొదలుకొని వెయ్యి రూపాయలు అదనంగా కట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.
ఇలా ఎనిమిది సార్లు గతంలో చెల్లించాల్సిన విద్యుత్ బిల్లును చెల్లించాల్సిన అగత్యం నెలకొందని, అలాగే జగనన్న మళ్ళీ కావాలని అధికారులు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. గంగిరెద్దుల వాళ్ళు కోటు వేసుకుంటారని, ఐఏఎస్ అధికారులు కూడా కోటు వేసుకుంటారని వీరిద్దరి మధ్య పెద్దగా తేడా లేదని ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకుతో స్ఫూర్తి పొంది డిఓపీటికి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి గారికి, ప్రధానమంత్రి గారి కార్యాలయానికి ఒక లేఖ రాశాను అని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో వైకాపాకు 25 లోకసభ స్థానాలకు 24 స్థానాలు లభిస్తాయని చెబుతున్నారని, ఓటు ఇజం అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోన్ నెంబర్ నుంచి ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చునని, దీని ద్వారా ప్రజాభిప్రాయం వెళ్లడ వుతుందని రఘురామకృష్ణ రాజు వెల్లడించారు.