సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం.. ఓవర్‌స్పీడ్‌ కాదు- జయవర్మ సిన్హా

-

రైలు ప్రమాద ఘటనపై కీలక విషయాలు తెలిపారు రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ సిన్హా. బహనాగ స్టేషన్‌ వద్ద ప్రమాద ఘటన జరిగిందని పేర్కొన్నారు. కోరమాండల్‌ లూప్‌లైన్‌లోకి వెళ్లిందని చెప్పారు. స్టేషన్‌ వద్ద రెండు లూప్‌ లైన్స్, రెండు మెయిన్‌ లైన్స్ ఉన్నాయని వెల్లడించారు.

సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాదానికి కారణం ఓవర్‌స్పీడ్‌ కాదు.. రెండు రైళ్లు నిర్దేశిత వేగంతోనే వెళ్తున్నాయన్నారు. లూప్‌ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలులో భారీగా ఐరన్‌ ఓర్‌ ఉంది. భారీ లోడ్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్‌ డీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు జయవర్మ సిన్హా.

Read more RELATED
Recommended to you

Exit mobile version