తిరుపతి కొండలను బోడి గుండులని టీటీడీ చైర్మన్ గా నియమితుడైన భూమన కరుణాకర్ రెడ్డి గారు అవమానించడం సబబేనా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి గారి వర్ణన జుగుస్సాకరంగా ఉందన్నారు. తన వ్యాఖ్యల ద్వారా భగవంతుడిపై ఆయనకున్న భక్తి తెలియజేస్తుందన్నారు. ఎంతో విద్యావంతుడైన కరుణాకర్ రెడ్డి గారు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా, తాను కూడా తాడేపల్లి ప్యాలెస్ బానిసేనని చెప్పకనే చెప్పాలనిపిస్తుందని అన్నారు.
తిరుపతి కొండను దర్శించుకున్న వారి ఫోటోలు నూట నలభై సంవత్సరాల కిందటే ఉన్నాయని, కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాత్రం దానికి భిన్నంగా 1954 నుంచే ఫోటోగ్రాఫ్ లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తిరుమల కొండలపై చిరుత పులులు అన్నవే లేవని, కొండలపై చెట్లన్నవే లేవని, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్టు కూడా తామే నాటామని ఆయన అంటారేమోనంటూ ఎద్దేవా చేశారు.
శేషాచలం అడవుల విధ్వంసం వల్లే అడవుల్లోని వన్య మృగాలు తమ దారిని మార్చాయని, వన్య మృగాలను వేటాడి తినే క్రూర మృగాలు కూడా వాటిని అనుసరిస్తున్నాయని, చిరుత పులులను కొట్టడానికి చిరుత పులుల నుంచి సంరక్షణ పథకంలో భాగంగా కర్ర ఇస్తున్నట్లుగా చెబుతున్నారని, తిరుమలలో మూడు చిరుతపులులను ఇప్పటికే పట్టుకున్నట్లుగా చెబుతున్నారని, తిరుపతిలో భూముల విలువ పెరగడం వల్ల, చిరుతలు, ఉడుతలు పెట్టడానికి జూ స్థలాన్ని అటవీ ప్రాంతంలోనే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతారేమోనని అన్నారు. ప్రస్తుతమున్న అయిదారు వేల ఎకరాల స్థలాన్ని కొట్టేస్తారన్న భావనలో ప్రజలు ఉన్నారని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు.