పెద్దపల్లి జిల్లాలో బాలికపై కేసులో ట్విస్ట్‌..అసలు గ్యాంగ్‌ రేప్‌ జరుగలేదట !

-

 

 

 

పెద్దపల్లి జిల్లాలో ఇటీవలే మధ్య ప్రదేశ్ కు చెందిన మైనర్ బాలికపై రేప్‌ జరిగినట్లు వార్తల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మధ్య ప్రదేశ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ మృతి పై ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ మైనర్ బాలిక ది గ్యాంగ్ రేప్‌ కాదు ఆత్మహత్య అంటూ తాజాగా లీకులు ఇస్తున్నారు. ఈ తరుణంలోనే పోలీసులపై ఓ రాజకీయ నాయకుడి ఒత్తిడి ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి.

పొలిటికల్ ఒత్తిడి వల్లే దర్యాప్తు పేరుతో తాత్సారం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కేసుపై నాలుగు రోజులుగా పోలీసులు మౌనం వహిస్తున్నారు. నాలుగు రోజులుగా దర్యాప్తు పేరుతో కేసును పోలీసులు సాగదీస్తున్నారు. మరో వైపు దర్యాప్తు జరుగుతున్న కేసు లో లీకులు ఇస్తున్నారు పోలీసులు. దీంతో మధ్యప్రదేశ్ బాలిక మృతి కేసులో అసలు నిజం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version