ఇవాళ టీడీపీలో చేరనున్న రఘురామకృష్ణంరాజు

-

raghurama raju into tdp party : వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ టీడీపీలో చేరనున్నారు రఘురామకృష్ణంరాజు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు రఘురామ కృష్ణంరాజు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు రఘురామకృష్ణంరాజు.

raghurama raju into tdp party

కాగా, జగన్ మోహన్ రెడ్డిపై తాను చేసిన పోరాటమే తనకు శాపం అయ్యిందేమోననిపిస్తోందని రఘురామకృష్ణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆపేక్ష లేకుండా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల మేలు కోసమే తాను పోరాటం చేశానని, ఎందరెందరో పార్టీలను పెట్టుకుంటున్నారని, తనకు రాజకీయంగా స్వార్థం ఉండి ఉంటే, ఏమో తాను కూడా పార్టీ పెట్టి ఉండే వాడినేమోనని అన్నారు. కానీ తనకు అటువంటి స్వార్థం లేదని, తాను మనసా వాచా కర్మణా కోరుకున్నది ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, శ్రామికుడైన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మాత్రమేనని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version