ఇలాగే ఉంటే.. భవిష్యత్తులో జపాన్‌లో అందరికీ ఒకే ఇంటిపేరు!

-

భవిష్యత్తులో జపాన్‌లో అందరికీ ఒకే ఇంటిపేరు వస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కఠినతర వివాహ చట్టాలు కొనసాగితే.. పెళ్లి చేసుకొన్న జంటలు వేర్వేరు ఇంటి పేర్లను ఉంచుకునే హక్కును ఇవ్వకపోతే.. 2531 నాటికి జపాన్‌ ప్రజల పేర్ల చివర ‘సాటో’ అనేది మిగులుతుందని పేర్కొంది.   జపాన్‌లో 18వ శతాబ్ధంలో చేసిన సివిల్‌ కోడ్‌ చట్టం ప్రకారం దంపతులు ఇద్దరూ ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలి.

తొహొకు విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ హిరోషి యషోహిడా నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో ఇప్పటికే ఆ దేశంలో 3,00,000 ఇంటి పేర్లు ఉన్నట్లు తేలింది. జనాభాలో అత్యధికంగా ‘సాటో’ అనేది 18,00,000 మంది పేర్ల పక్కన కనిపిస్తుందవు, ఆ తర్వాత స్థానాల్లో సుజుకీ, తకాహాషి ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఆ దేశంలో దంపతులు వేర్వేరు ఇంటిపేర్లను పెట్టుకొనే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్లు మొదలయ్యాయి.

ప్రస్తుతం జపాన్‌లో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గింది. 2023లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వివాహాల్లో 6 శాతం తగ్గుదల కనిపించింది. దాదాపు 12 కోట్లకుపైగా జనాభా ఉన్న దేశంలో 5,00,000 కంటే తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. గత 90 ఏళ్లలో ఇదే అత్యల్పంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version