రానున్న ఎన్నికల్లో ఓటుకు 10,000 కాకపోతే 20,000 ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేస్తారని ఆరోపణలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.గత ఎన్నికలకు ముందు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అదే మద్యం అమ్మకాల ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి 40,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని నరసాపురం ఎంపీ నాయకుడు రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత మద్య నిషేధం అమలు చేయాలన్నా జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన 40 వేల కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపారు.స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసు రిమాండ్ రిపోర్ట్ పై చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిన తర్వాత రఘురామకృష్ణ రాజు గారు స్పందిస్తూ సుప్రీం కోర్టులో తప్పక న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో 90% మంది చంద్రబాబు నాయుడు గారుకి న్యాయం జరగాలని కోరుకున్నారని అన్నారు. కేవలం 10% మంది మాత్రమే జగన్ మోహన్ రెడ్డి గారి అన్యాయానికి న్యాయం జరగాలని ఆశించారని తెలిపారు.