ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఏప్రిల్‌ నుంచే

-

 

ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త. రేషన్ కార్డులు ఉన్నవారికి చిరుధాన్యాల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఏప్రిల్ నెల నుంచి రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుండగా, ప్రతినెల ఇచ్చే రేషన్ లో రెండు కేజీల బియ్యం బదులుగా రాగులు, జొన్నలు సరాఫరా చేయనుంది.

అటు రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేలా ఉత్పత్తులు కొనుగోలు చేసిన వెంటనే, వారికి నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇక అటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రొబేషన్ ఖరారైన వారందరికీ సర్వీస్ నిబంధనల ప్రకారం అన్ని రకాల సెలవులు వర్తింపజేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొబేషన్ ఖరారు అయిన కొన్ని ముఖ్యమైన సెలవులు వర్తింపజేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో, అన్ని రకాల సెలవులు వర్తించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని విభాగాధిపతులకు సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version