నరేష్ – పవిత్రల మొదటి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా..?

-

ఎట్టకేలకు సీనియర్ నటుడు నరేష్ మరో సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను తాజాగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అనేక ట్విస్ట్ ల మధ్య ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్ లోనే జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. తనకు పవిత్ర లోకేష్ తో వివాహమైనట్లు నరేష్ ఆ పెళ్లి వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

ఇకపోతే అలా పెళ్లయిందో లేదో ఈ కొత్త జంట అప్పుడే హనీమూన్ కి కూడా బయలుదేరింది. వీరిద్దరూ కలిసి దుబాయ్ కి హనీమూన్ కి వెళ్తున్నారు అంటూ ఇప్పుడు బాగా వార్తలు వైరల్ అయితున్నాయి. అయితే త్వరలోనే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నరేష్ షేర్ చేస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నరేష్ నాలుగో పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతమంది అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటూ కొట్టి పడేస్తున్నారు.. మరి కొంతమంది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పెళ్లి వీడియో షేర్ చేశారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా నరేష్ అనుకున్నట్టుగానే నాలుగో పెళ్లి కూడా చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొత్తానికైతే వీరిద్దరి వ్యవహారంపై గతంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా నానా రచ్చ చేసింది. దీనిపై స్పందించిన పవిత్ర , నరేష్ ఓపెన్ గానే మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటాము ఏం చేసుకుంటావో చేసుకో అంటూ చాలా దారుణంగా మాట్లాడారు.. నిజానికి 2018లో వచ్చిన ఒక సినిమా వీరి మధ్య బాండింగ్ బలపడడానికి కారణం అయ్యింది.. అదే సమ్మోహనం.. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోకి తల్లిదండ్రులుగా నరేష్ , పవిత్ర లోకేష్ నటించారు. ఇక ఆ తర్వాత వీరిద్దరి కెమిస్ట్రీ తెరపై బాగుండడంతో రియల్ లైఫ్ లో కూడా ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version