తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే రిపోర్ట్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే చేసింది. అయితే.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. బీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ మరోసారి అంటే హ్యట్రిక్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాకపోతే.. దాదాపు 20 సీట్లు తగ్గే ఛాన్స్ ఉంది.
ఆత్మ సాక్షి సర్వే ప్రకారం… సీట్ల వారీగా
బీఆర్ఎస్ : 64-70
కాంగ్రెస్ : 37-43
బీజేపీ : 5-6
ఏంఐఎం : 6-7
గట్టి పోటీ ఉన్నవి : 6
ఓట్ షేర్ వారీగా
బీఆర్ఎస్ : 42.5%
కాంగ్రెస్ : 36.5%
బీజేపీ : 10.75%
ఏంఐఎం : 2.75%
ఇతరులు : 7.5%
గతంలో దుబ్బాక, హుజురాబాద్, నాగార్జున సాగర్, కర్ణాటక సర్వేలను సరిగ్గా అంచనా వేసిన శ్రీ ఆత్మ సాక్షి టీం..ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే విడుదల చేసింది. కాగా.. ఓట్ షేర్ పై మిషన్ చాణక్య సర్వే చేయగా…బీఆర్ఎస్ కు 44.62%, కాంగ్రెస్ కు 32.71%, బిజెపికి 17.6%, ఇతరులకు 5.07% ఓట్లు వస్తాయని అంచనా వేసింది బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆదిక్యం వస్తుందని సర్వే రిపోర్ట్ తేల్చింది. అటు నిన్న విడుదలైన ఇండియా టీవీ సర్వే కూడా బిఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.