Ram Mohan Naidu Comments on errannaidu: కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని గుర్తు చేసుకున్నారు. ‘నాన్నగారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి.
నా కథకి నువ్వే హీరో నాన్న. పైనుండి నన్ను ఎప్పుడు మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన KRN……వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
కాగా, కొత్త కేబినెట్లో అతిపిన్న వయస్కుడిగా టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు(36) నిలిచారు. ఆయన తర్వాత మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే(37), లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) ఎంపీ చిరాగ్ పాసవాన్(41), రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) ఎంపీ జయంత్ చౌదరి(45) అతి పిన్న వయస్కులుగా ఉన్నారు. మరోవైపు అతి పెద్ద వయస్కుడిగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) వ్యవస్థాపక అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ(79) ఉన్నారు.