BREAKING : అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు సీ. రామచంద్రయ్య. వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. ఈ సందర్బంగా సీ రామచంద్రయ్య మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని ఫైర్ అయ్యారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశానని..ఎమ్మెల్సీ గా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నానని…ఇప్పటి వరకు రాజకీయ విలువలు కాపాడుకుంటు వచ్చానని పేర్కొన్నారు. వైకాపా లో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందానని… కొంతకాలం నుంచి మీడియా కు దూరంగా ఉన్నానని గుర్తు చేశారు. ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయామని… తప్పిదాలను జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదన్నారు. జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలి….పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్ర్కాప్ అంటున్నారన్నారు.