కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు మాట్లాడుతూ…నిజాం సాగర్ మండలం లో దళిత బంధు మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని వెల్లడించారు.
‘బంధు ‘పథకాల ప్రభావం మనపై పడిందని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు కేటీఆర్. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవు…జిల్లాల సంఖ్య తగ్గ్గిచేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు.