ఇది వేసవి కాలం. రెండు తెలుగు రాష్ట్రా ల్లో ఎండలు మండి పోతున్నాయి. దీంతో.. జనాలు బయటకు రావాలంటే వణికీపోతున్నారు. కానీ.. కొంత మంది తెలంగాణ వారు మాత్రం విపరీతంగా బీర్లు తాగేస్తున్నారు. ఈ తరుణంలోనే.. తెలంగాణ రాష్ట్రం లో రికార్డు స్థాయి లో బీర్ల విక్రయాలు జరిగాయి.
మద్యం అమ్మకాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలే టాప్ లో నిలిచాయి. మే నెల 01 నుంచి 18వ తేదీ వరకు 4.23 కోట్ల బీరు సీసాల విక్రయం జరిగాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి 582.99 కోట్ల ఆదాయం వచ్చింది. మరో రెండు వారాల్లో పెరగనున్నాయి అమ్మకాలు. మండుతున్న ఎండలకు ఉపశమనం పొందుతున్నారు మద్యం ప్రియులు.