ఏపీలో ఉన్నటువంటి డ్రైవరన్నలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర నిధులను డ్రైవర్ల ఖాతాల్లో వేయనుంది జగన్ సర్కార్. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర నిధులను విడుదల చేస్తున్నారు. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయనుంది.
ఇక ఈ వైఎస్సార్ వాహన మిత్ర పథకం కారణంగా 2,75,931 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. అటు వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద 275.93 కోట్ల ఆర్థిక సహాయం చేస్తోంది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే… ఇవాళ విజయవాడ విద్యాధరపురంలో వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వై.ఎస్. జగన్. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో.. విజయవాడ విద్యాధరపురంలో వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వై.ఎస్. జగన్.