సీఎం జగన్‌కు వ్యూహం అవసరం లేదు : RGV

-

RGV wishesh CM Jagan : సీఎం జగన్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్‌ వివాదస్పద దర్శకులు RGV. ఏపీ సీఎం జగన్ కు ఎలాంటి వ్యూహం అవసరం లేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. సీఎం జన్మదినం సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.

RGV wishesh CM Jagan

జగన్ వెనుక ఎలాంటి వ్యూహం లేదని, ఆయన సూటిగా వెళ్లే వ్యక్తి అని పేర్కొన్నారు. జగన్ పొలిటికల్ జర్నీపై RGV వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, అటు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు నేతలు. అనంతరం కేక్ కట్ చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version