అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆడదాం ఆంధ్రా క్రీడలు ప్రారంభం

-

సీఎం జగన్‌ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, యువత ప్రతిభను వెలికి తీసి రాష్ట్ర, దేశ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా క్రీడలు గాంధీ జయంతి అక్టోబర్ 02 న ప్రారంభించనున్నామని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం సాయత్రం స్థానిక గ్రాండ్ రిట్జ్ హోటల్ నందు యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ప్రిన్స్ పల్ సెక్రటరీ వాణి మోహన్ , ఎం.డి.హర్ష వర్ధన్ , సెట్విన్ సి ఇ ఓ మురళి కృష్ణ , చీఫ్ కోచ్ లతో పర్యాటక శాఖ మంత్రి ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణ పై సమీక్షించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ…..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్టమంతా ప్రతి సచివాలయ స్థాయిలో 17 సంవత్సరాల వయసుపై బడిన యువతకు క్రికెట్ , బాడ్మింటన్ , వాలీబాల్ , కబడ్డీ, ఖోఖో క్రీడల్లో అవకాసం కల్పించి అక్కడి నుండి మండల, అసెంబ్లీ , జిల్లా , రాష్ట్ర స్థాయిల్లో ఎంపిక జరిగి ప్రతిభ కనబరిచిన వారికి రూ. 12 కోట్ల తో నగదు బహుమతులు ప్రధమ, ద్వితీయ , తృతీయ స్థానాల్లో గెలుపొందిన క్రీడా కారులకు అందించనున్నామని ఆమేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు కావాలని అన్నారు. 46 రోజులు పాటు జరిగే ఈ క్రీడా పోటీలు 2,99,000 జరగనున్నాయని అన్నారు. మరో రూ.42 కోట్లతో క్రీడాకారులకు క్రీడా కిట్స్ అందించాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనడానికి యువత కోసం ప్రత్యేక యాప్ తయారు చేసి నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. క్రీడల్లో పాల్గొన్న యువత ఆరోగ్యం బాగుపడి , ప్రతిభ తో జీవన విధానం మెరుగవుతుందని అన్నారు. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సాహానికి ఇదొక మంచి సదవకాశమని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి యువతను భాగస్వామ్యులు చేయాలనీ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news