సభ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నందుకే TDP సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారని మంత్రి రోజా తెలిపారు. ‘ఇప్పుడు ఒక్కరోజే, గతంలో నన్ను ఒక సంవత్సరం సస్పెండ్ చేశారు’ అని గుర్తు చేశారు. స్పీకర్ దగ్గరకు ఎవరు రాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో 8 మంది, గుంటూరులో ఇద్దరు చనిపోయారన్నారు. ర్యాలీల్లో ఎవరు చనిపోవద్దని GO నెం. 1 ను సీఎం తీసుకువచ్చారని చెప్పారు.
ఎన్నికల్లో గెలిచామని చంకలు గుద్దుకుంటున్న చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడులకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ మంత్రి రోజా విసిరారు. చంద్రబాబు, లోకేష్ గల్లీ గల్లీ తిరిగిన వెల్లగొట్టారని రోజా అన్నారు. పార్టీ సింబల్ ఉండే ఎన్నికలు వస్తే ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2024 లోను ప్రజలు జగన్ తోనే ఉంటారని తెలిపారు. ఇక పులివెందులలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.