వీరమల్లు రిలీజ్ రోజే పవన్ కళ్యాన్ పరువు తీశారు రోజా. “తన పేరే పవనం అని అందుకే అంతటా తిరుగుతూ ఉంటా” అంటూ తనపై ప్రత్యర్ధులు చేసిన విమర్శలకు నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. “అపాన వాయువు అంతటా ఉంటుంది కానీ ఎలాంటి లాభం” అని ఆమె పేర్కొన్నారు.
దీంతో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రోజా ఇలా కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి రోజాకు పవన్ కళ్యాణ్ కు మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు రోజా ఏదో ఒక రకంగా కౌంటర్ ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు రోజా ఇలా చేయడంతో ఈ విషయం పెద్ద వివాదాస్పదంగా మారింది. దీనిపై రోజా ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి.